కానీ ఒక రోజు ఆ ఆవు తప్పిపోయింది. ఎంత వెతికినా దొరకలేదు. రామయ్య చాలా విచారించాడు. దూడ కూడా తల్లి కోసం దిగులు పడింది. దాంతో రామయ్య ఒక ఉపాయం ఆలోచించి "నా ఆవు తప్పిపోయింది. దాన్ని తెచ్చి ఇచ్చిన వాళ్లకు దూడను కూడా ఇచ్చేస్తాను" అని దండోరా వేయించాడు.
దూడ కోసం ఆశపడిన గోపన్న అనే వ్యక్తి తన కొట్టంలో కట్టేసున్న ఆ అవును తీసుకొని రామయ్య దగ్గరికి వచ్చాడు. "ఆవును తెచ్చాను, దూడని కూడా ఇస్తే తీసుకొనిపోతాను " అన్నాడు. దూడను గుర్తుపట్టిన ఆవు గోపన్నను ఒక్క తన్ను దాని దూడ దగ్గరకి పరుగెత్తినది. నడుము విరిగిన గోపన్న లబోదిబోమన్నారు. రామయ్య తన ఆవు తనకు దక్కినందుకు, దూడకు తల్లి దొరికినందుకు సంతోషించారు.
