ఇంతలో ఒక డేగ వచ్చింది. ఈ పావురం నా ఆహారం, నేను తినాలి దాన్ని నాకు ఇచ్చేయి అని కోపంగా అడిగింది డేగ, పావురాన్ని ఇవ్వను దానికి బదులు ఇంకేదైనా అడుగు అన్నాడు శిబి చక్రవర్తి.
అయితే పావురం అంత బరువు గల నీ తొడ మాంసము ఇవ్వాలి అని అడిగింది డేగ. శిబి చక్రవర్తి త్రాసు తెప్పించి ఒక వైపు పళ్ళెంలో తన తొడ మాంసము కోసి వేశాడు. ఎంత మాంసము కోసి వేసినా పావురంతో సమానం కాలేదు.
చివరికి తానే త్రాసులో రెండో పళ్ళెంలో కూర్చున్నాడు. పావురానికి బదులుగా మొత్తం తన శరీరాన్ని అంతా తినెయ్యమని డేగను వేడుకున్నాడు. వెంటనే డేగ ఇంద్రుడిగా మారింది, పావురం అగ్ని దేవుడిగా మారింది.
వాళ్ళను చూసి శిబి చక్రవర్తి ఆశ్చర్యపోయాడు. ఇంద్రుడు, అగ్నిదేవుడు ఇలా అన్నాడు. శిబి చక్రవర్తి! మేం నిన్ను పరీక్షించాలని వచ్చాం. ఈ పరీక్షల్లో నీవే గెలిచావు. నీ దానగుణం, త్యాగగుణం చూసి సంతోషించాము. గొప్ప దాతగా భువిలో నీపేరు నిలిచిపోతుంది అని దీవించి అదృశ్యం అయినారు.
నీతి: ఎప్పటికైనా సత్యమే గెలుస్తుంది.
