గురుర్బ్రంహ గురుర్విష్ణుః
గురుదేవో మహేశ్వరః
గురుస్సాక్షత్ పరంబ్రహ్మ
త స్మై శ్రీ గురవే నమః
శిష్యునకు గురువే, బ్రహ్మ - విష్ణువు - మహేశ్వరుడు. త్రిమూర్తి స్వరూపమే కాదు; పరబ్రహ్మ కూడా ఆ గురువే, అట్టి గురుదేవులకు నమస్కారం.
మన పవిత్ర భారతదేశములో, విద్యా దానాంచేసే గురువుకు ఒక విశిష్ట స్థానం కల్పించబడనది. ఈ నాటి పాఠశాలల్లో జరిగే విద్యాభ్యాసం మనకు తెలిసిందే. పూర్వకాలంలో విద్యార్థులు గురుకులం లోనే నివసించేవారు. శిష్యులు గురువుగారికి సేవలు చేసి, ఆయన అనుగ్రహం పొంది ఆ యా విద్యల్లో మంచి ప్రావీణ్యం సంపాదించేవారు.
గురూపదేశం తప్ప విద్యార్థులకు శ్రేష్టమైన మరో మార్గం లేదు గదా!
అసలు ఒక పనిని మానవుడు సాధించాలని అనుకున్నప్పుడు దానిని సక్రమమైన మార్గంలోనే సాధించాలి. ఏదో ఒక మార్గం - సాధించడం మాత్రమే ముఖ్యం అనుకోకూడదు.
విద్య విషయానికి వస్తే, నియమ నిబంధనలు చాలా ముఖ్యం. గురోపదేశం లేకుండా పొందిన విద్య సార్థకం కాదు.
