వెంకయ్య ఒకనాడు సంతకు వెళ్లి బాగా బలిష్టంగా వున్న, వేరొక ఎదునుకొని తెచ్చుకున్నాడు. అప్పటి నుండి కొత్త ఎదుకు దండిగా మేతవేసి, కుడితి పెట్టి జాగ్రత్తగా మేపుతుండేవాడు. ముసలి ఎద్దుకి మాత్రం కాస్త ఎండు గడ్డి వేసి ఊరుకునేవాడు. క్రమంగా అది కూడా దండగ అనుకున్న వెంకయ్య ఒకరోజు గుంజకు కట్టి ఉన్న ముసలి ఎద్దును విప్పి "నీకు పని చేసే వయసు అయిపోయింది. శక్తి లేదు. ఇక నీవు నాకు దండగ. నీ దారి నువ్వు చూసుకో" అని ముసలి ఎద్దుని తరిమేశాడు.
ఏడుస్తూ వెళుతున్న ఎదుగోపన్న అనే బాలుడు ఎదురొచ్చాడు. ఎద్దుని చూసి "ఎందుకు ఏడుస్తున్నావు? " అని అడిగాడు. ముసలి ఎద్దు తన జాలి గాథ వినిపించింది.
గోపన్న ఒక ఉపాయం అలోచించి ముసలి ఎద్దుని తీసుకొని వెంకయ్య ఇంటికి వెళ్లి "ఈ ఎద్దు నీదే కదూ!" అని అడిగాడు. అవును అన్నాడు వెంకయ్య. "దీన్ని నాకు అమ్ముతావా? నీకు వరహాలు ఇస్తాను." అన్నాడు గోపన్న.
వెంకయ్య ఆశ్చర్యపోగా గోపన్న అందుకొని "నీకు తెలియాదా? ముసలి ఎద్దును ఇంటి ఎదురుగా కట్టేసి, రోజూ దానికి నమస్కరించి, మేత వేసి వెళితే బోలెడు దనం వస్తుంది" అని చెప్పాడు. వెంకయ్య ఆ మాటలు నమ్మి, తన ముసలి ఎద్దుని తీసేసుకొని, నాటి నుండి దానికి దండిగా మేత వేసి నమస్కరించి పొలం పనులకు వెళ్ళేవాడు. ఆ ఏడు దండిగా వర్షాలు కురిసి పొలం బాగా పండడంతో బాగా లాభాలు వచ్చాయి. అదంతా ముసలి ఎద్దు వల్లనే అని సంబరపడ్డాడు వెంకయ్య.
