కొంత కాలానికి ఏదో పనిమీద రైతు నాగలి పట్టుకొని కమ్మరి దగ్గరకు వచ్చాడు. ఆ నాగలి కొన్నప్పటికంటే తళ తళా మెరుస్తోంది. కమ్మరి దగ్గరే వున్నా నాగలి మాత్రం తుప్పు పట్టి ఒక మూలాన పడి వుంది. "మనమిద్దరం ఒకే ఇనుప ముక్క నుండి తయారయ్యాం. నేనేమో తుప్పు పట్టి ఇలా అద్వానంగా ఉన్నాను. నువ్వేమో ఎంచక్కా మెరుస్తున్నావు, ఎందుకు?" అని అడిగింది. బదులుగా... "నా యజమాని నాతో రోజు పొలం దున్ని నన్ను సానబెడతాడు. కానీ నీకా అవకాశం లేదు. కాబట్టి ఎప్పటి లాగే ఉండిపోయావు. ఇప్పటికైనా పనిచేయడంలోనే అందం, ఆనందం ఉన్నాయని గ్రహించు" అని చెప్పింది మొదటి నాగలి. ఆరోజే మూలనున్న నాగనాగాలి తనని కూడా ఎవరైనా రైతుకి అమ్మి వేయమని కమ్మారితో చెప్పింది.
అందం - ఆనందం
జూన్ 10, 2020
0
ఒక ఊరిలో కమ్మరి ఉండేవాడు. అతడు తన కొలిమిలో ఒక ఇనుప ముక్కతో రెండు నాగళ్లు చేశాడు. మొదటి నాగలి "నన్ను ఎవరికైనా అమ్మివేయి. పొలం దున్ని పంట సాగుకు ఉపయోగపడుతాను" అంది. రెండో నాగలి మాత్రం "నన్ను ఎవరికీ అమ్మవద్దు. నీ దగ్గరే వుంటాను, నేను పనిచేయలేను" అంది. అవి కోరినట్లే కమ్మరి మొదటి నాగలిని ఓ రైతుకి అమ్మేశాడు. రెండో నాగలిని మాత్రం తన శాలలో ఓ మూలాన పడేసాడు.
Tags:
