అనగనగా ఒక ఊరిలో రంగారావు అనే ఆసామి ఉండేవాడు. ఆయనకు ఒకసారి బాగా జబ్బు చేసింది. తన కుమారుడైన రాముని పిలిచి, "జీవితంలో ఎప్పుడూ అబద్ధం చెప్పనని ప్రణామం చెయ్యి" అని అడిగాడు. అందుకు సరేనని చెప్పి, తండ్రి చేతిలో చెయ్యి వేసి ప్రమాణం చేశాడు రాము.
ఒకరోజు రాము అడవి మార్గాన పట్టణానికి వెలుతుండగా దోపిడీ దొంగలు అతడిని చుట్టుముట్టారు. వారిలో ఒకడు "నీ దగ్గరేం ఉన్నాయి?" అని అడిగాడు. "నా దగ్గర యాబై రూపాయలు ఉన్నాయి" అని చెప్పాడు రాము.
దొంగలు అతని జేబులు వెతికారు. కానీ ఏమీ దొరకలేదు. వాళ్ళు మారు మాట్లాడకుండా వెళ్లిపోతుంటే, వెనక్కి పిలిచి, "నా దగ్గర నిజంగానే డబ్బులు ఉన్నాయి. ఆ నోటుని నేను నా చొక్కా జేబులో రహస్యంగా దాచాను. అది మీకు కనపడలేదు. ఇదిగో తీసుకోండి" అంటూ యాబై రూపాయల నోటు వారి చేతికి ఇవ్వబోయాడు.
ఆ దొంగలముఠా నాయకుడు, రాము నిజాయితీకి సంతోషపడి, అతడిని మెచ్చుకున్నాడు. అంతేకాక వందరూపాయలు బహుమానం కూడా ఇచ్చి వెళ్ళిపోయాడు. తన తండ్రి నిజం చెప్పమని ఎందుకు చెప్పాడో రాముకి అర్ధం అయ్యింది.
నిజం చెప్పినవారికి అన్నిటా విజయం లభిస్తుంది
