ఔన్నత్యం

writer
0
ఒకసారి కబీర్ ఇంటికి రాత్రి సమయంలో ఒక బాటసారి వచ్చాడు. కబీర్ అతనికి   భోజనం పెట్టి, రాత్రి విశ్రాంతి తీసుకొని ఉదయాన్నే వెళ్ళమని చెప్పి   పడుకోడానికి ఖరీదైన కంబళ్లు ఇచ్చాడు. 

కంబళ్ళపై   పడుకున్న బాటసారికి, వాటిని తనతో తీసుకొని వెళ్లాలని ఆలోచన రావడంతో,  అర్ధరాత్రి ఎవ్వరికీ చెప్పకుండా వాటిని తీసుకొని బయలుదేరాడు. 

ఆ సమయంలో తిరుగుతున్న సైనికులు కంబలితో వస్తున్న   కొత్త  వ్యక్తిని దొంగగా  అనుమానించి  పట్టుకున్నారు.  రాజ భటులను చూసి  భయంతో తాను కబీర్  ఇంటి నుండి వస్తున్నట్లు చెప్పాడు. రాజ భటులు అతనిని కబీర్ ఇంటికి తీసుకొని వెళ్ళి విచారించారు. 

అంతా తెలుసుకున్న కబీర్  వారితో, "ఇతను నాకు తెలిసిన వ్యక్తి,  కంబళ్లు కావాలంటే ఇచ్చాను.  ఇతన్ని వదిలేయండి" అని అనడంతో రాజ భటులు అక్కడి నుండి వెళ్లిపోయారు.

బాటసారి కబీర్  ఔన్నత్యం  చూసి కన్నీరు మున్నీరుగా   "నన్ను క్షమించండి.  మీరు నా ఆకలి తీర్చి  వుండడానికి చోటు ఇచ్చారు. నేనేమో మీరు ఇచ్చిన కంబళ్లు తీసుకొని పారిపోవాలని అనుకున్నాను. ఇదంతా మనసులో పెట్టుకోకుండా నన్ను మీరు కాపాడారు అంటూ" కబీర్ కాళ్ళ మీద పడిపోయాడు.
  

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు

Please Select Embedded Mode To show the Comment System.*